– రాహుల్ గాంధీకి ప్రియాంక భావోద్వేగ పోస్టు
న్యూఢిల్లీ : నీ సోదరి అయినందుకు గర్వపడుతున్నానని రాహల్‌గాంధీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రియాంక భావోద్వేగంగా ఒక పోస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఈ పోస్టును చేశారు. ఎన్నికల యుద్ధభూమిలో రాహుల్‌గాంధీ సత్యాన్ని, నమ్మకాన్ని ప్రియాంక గాంధీ అభినందించారు. ‘ఎవరు ఎన్ని అన్నా.. ఎన్ని చేసినా.. మీ నమ్మకాన్ని అనుమానిం చినా మీరు ధైర్యంగా ఉన్నారు. మీ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. నిజం కోసం పోరాటం ఆపలేదు. నిజాలను అణగదొక్కడానికి వారు అబద్ధాలను ప్రచారం చేసినా.. మీరు కోపం, విద్వేషం వ్యక్తం చేయలేదు’ అని ప్రియాంక ప్రశంసించారు. రాహుల్ తన హృదయంలోని ప్రేమ, నిజం, దయతో పోరాటం చేసినందుకు ప్రియాంక అభినందించారు. ‘ఇప్పటి వరకూ నిన్ను చూడలేని వారిని ఇప్పుడు నిన్ను చూడనీ.. కానీ మాలో చాలా మందికి తెలుసు, చూశాం నువ్వు మా అందరికంటే ధైర్యవంతుడని’ అని ప్రియాంక తెలిపారు. హుల్‌గాంధీ.. నేను మీ సోదరి అయినందుకు గర్వపడుతున్నాను’ అని ప్రియాంక చెప్పారు.