మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నవతెలంగాణ-వీణవంక
మండల కేంద్రంలోని ఓరెం వెంకటరాజం అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థతి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సర్పంచ్ నీల కుమారస్వామి వెంకటరాజం మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట వార్డు సభ్యుడు తాళ్లపల్లి మహేష్, గ్రామస్తుడు ఓరం భానుచందర్, ఓరెం శ్రీనివాస్, ఓరెం క్రాంతి, ఓరెం మధు, ఓరెం మధు, ఓరెం ఆగయ్య, కోండ్ర ప్రమోద్, పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love