విద్యార్థులకు నోట్‌బుక్స్‌లు అందజేత

నవతెలంగాణ-శంకర్‌పల్లి
పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులకు నోట్‌ బుక్స్‌లు పంపిణీ చేసినట్టు మహారాజ్‌ పేట గ్రామ సర్పంచ్‌ నర్సింహారెడ్డి అన్నారు. 77స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం మండల పరిషత్‌ ప్రాథమిక శ్రీ రేసు సత్తిరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మహారాజ్‌ పేట్‌లో 250 మంది విద్యార్థులకు రూ.2 లక్షల50 వేలు విలువ ఉన్న రేసు సత్తిరెడ్డి తనయులు రేసు మహేందర్‌ రెడ్డి హైకోర్ట్‌ సీనియర్‌ న్యాయవాదులు, రేసు రాజేందర్‌ రెడ్డి ట్రస్ట్‌ చైర్మైన్‌ తరపున పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మెన్‌ భద్రి.శ్రీకాంత్‌ ద్వారా విద్యార్థులకు 1వ తరగతి నుంచి పదోవ తరగతి విద్యార్థులకు నోట్‌బుక్స్‌, రాత పుస్తకాలు, ప్యాడ్స్‌ వివిధ రకాల విద్యకు సంభందించిన వస్తువులు అందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మహారాజ్‌పేట్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్‌ అందించడం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యా యులు జీవన జ్యోతి, తాహేర్‌ అలి, వార్డు మెంబర్‌ గడ్డం. రవీందర్‌, ఎంపీటీసీ తనయులు తొండ.రవీందర్‌, గ్రామ స్తులు సంతోష్‌, కృష్ణ, ఉపాధ్యాయులు సరిత, సంగీత, పుష్పాలత, సుమతి, అశోక్‌, బాలరాజ్‌, రాజేందర్‌రెడ్డి, అన సూయ, రవీందర్‌ రెడ్డి, కృష్ణ, రియాజ్‌, జ్యోతి, విద్యార్థులు తదితరులున్నారు.

Spread the love