నవతెలంగాణ రాజంపేట్: మండల కేంద్రానికి చెందిన గ్యార బాలయ్య నివాస గుడిసె దగ్ధం కావడంతో వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ ఆముదాల సౌమ్య నాగరాజు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి బట్టలను వితరణ చేశారు. ఆ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఏ ఒక్కరికైనా సమస్య వస్తే వారికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.