నవతెలంగాణ – నాంపల్లి: మండలంలోని దేవత్ పల్లి గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ముదిగొండ రవి తల్లి ముదిగొండ ఎల్లమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి శనివారం ఎల్లమ్మ కుటుంబ సభ్యులకు ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో దేవత్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.