గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందజేత

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గర్భిణి స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నదన్నారు. మహిళలలో రక్తహీనత, పోషకారా లోపాలను తగ్గించేందుకు కేసీఆర్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.17 మంది గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్ రెడ్డి, ఒకటో వార్డు కౌన్సిలర్ కొంకటనలినీ దేవి, గర్భిణీ స్త్రీలు ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love