నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఆర్టీయూ తెలంగాణ విచ్ఛిన్నానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయనీ, అధ్యక్షులుగా తాను, ప్రధాన కార్యదర్శిగా బిక్షంగౌడ్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన పర్వతి సత్యనారాయణ ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శి అని చెప్పడం, దానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి సమర్థించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. పీఆర్టీయూ తెలంగాణ ఎవరి సొంతం కాదనీ, అలా ఎవరు చెప్పినా ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.