నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ లక్నోలో ఆది, సోమవారాల్లో జరుగుతున్న అఖిల భారత ఫెడరేషన్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం బయలుదేరి వెళ్లింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య సారథ్యంలో, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, సహాధ్యక్షులు గోలి పద్మ, ఉపాధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్, ఉమారాణి ఆదివారం లక్నోకు వెళ్లారు. తెలంగాణలో జరుగుతున్న విద్యా వ్యవస్థ, ఇతర రాష్ట్రాల విద్యావ్యవస్థపై చర్చించనున్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చిస్తారు. విద్యారంగంలో, బోధనలో వస్తున్న మార్పుల గురించి సమాలోచన చేస్తారు. వాటిపై పలు నిర్ణయాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారు.