పీఆర్టీయూ టీఎస్ సభ్యత్వ నమోదు వారోత్సవాలు విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి
– రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి పిలుపు
– ములుగు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం మానేశ్వరరావు
నవతెలంగాణ- తాడ్వాయి
రేపటినుండి జరిగే పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మేడారంలో ములుగు జిల్లా పిఆర్టియు టీఎస్ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ, సమన్వయకర్త వేం యాకూబ్ రెడ్డి ఆధ్వర్యంలో పి ఆర్ టి యు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ రేపటినుండి జరగబోయే సభ్యత వారోత్సవాల్లో ప్రతి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులందరికీ సంఘం చేసిన కృషిని పిఆర్సి సాధించడంలో వయోపరిమితి పెంపు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసేలా సంఘం చేసిన కృషిని వివరిస్తూ సభ్యత్వం స్వీకరించాల్సిందిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మధ్యంతర భృతి ఇప్పించడం, సిపిఎస్ రద్దుకై కార్యచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, పెండింగ్ బిల్లుల సమస్య ఈ నెలాఖరులోపు పరిష్కారం అవుతుందని అన్నారు.
అనంతరం ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పి ఆర్ టి యు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ ఉపాధ్యాయులు పాయం మానేశ్వర్ రావు ను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు పి అర్ టి టీఎస్ ఉపాధ్యాయ సంఘం నుండి తీర్మానించారు. ఈసారి పాయం మానేశ్వరరావుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పాయం మానేశ్వరరావు విద్యావంతుడు, త్యాగశీ, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై కృషి చేస్తాడని ఆయనను ప్రజలు ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రధాన సంపాదకుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఇన్నారెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగురి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, రాష్ట్ర బాధ్యులు ధర్మయ్య, ముకుంద రెడ్డి భూక్యా బాబురావు నారాయణరావు 9 మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ సభ్యులు, క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love