పశ్చిమ దేశాలతో యుద్ధానికి సై : పుతిన్

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు సైనికపరమైన మద్దతును ప్రకటించడం ద్వారా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యావత్ ప్రపంచాన్ని యుద్ధం ముంగిట నిలబెట్టాయని ఆయన తెలిపారు. ఆ మూడు దేశాల అడ్డదిడ్డమైన నిర్ణయాల వల్ల అణ్వాయుధ శక్తుల నడుమ ప్రత్యక్ష ఘర్షణకు దారితీసే విషమ పరిస్థితులు అలుముకున్నాయని కామెంట్ చేశారు. రష్యాను ఓడించాలనే దురుద్దేశంతోనే ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించే బిల్లుకు అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. రష్యా ప్రయోజనాలను దెబ్బతీయడంపైనే నాటో కూటమి ఫోకస్ చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధ నియంత్రణపై అమెరికాతో రష్యా చర్చలు జరపాలనే అంశమే సరికాదని ఆయన స్పష్టం చేశారు. రష్యాను అప్రతిష్టపాలు చేసేందుకు పశ్చిమ దేశాలు కుట్రపన్నాయన్నారు.

Spread the love