హాస్టల్స్ లో సైకాలజిస్ట్ లను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని మోతె మండలం బురకచర్లలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని, తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్ట్ లను ఏర్పాటు చేసి, విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు.
Spread the love