ప్రజా ఆశీర్వాద  సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలి..

– బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం
నవతెలంగాణ – చండూరు 
మునుగోడు లో గురువారం నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేయ్యాలని గట్టుప్పల్ర బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా మునుగోడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న బహిరంగ సభకు  సీఎం కేసీఆర్ హాజరుకానున్నాట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే విదంగా  ఘట్టుప్పల మండల  బిఆర్ఎస్  నాయకులు  కార్యకర్తలు కృషి చేయ్యాలని  తెలియజేశార పిలుపునిచ్చారు.
Spread the love