రాష్ట్రంలో ప్రజా రంజక పాలన ప్రారంభమైంది

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి : 
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ప్రజా రంజక పాలన ప్రారంభమైందని శనివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మహిళకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించినందుకు, సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల కేంద్రంలో మహిళల ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి, స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్నారం, స్కూల్ తాండ, బట్టు తండాల్లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, ఎండి సల్మాన్, రెడ్డి నాయక్, లచ్చిరాం, వడ్ల లక్ష్మణ్, చింతకుంట కిషన్, కుమ్మరి శంకర్, గొల్లపల్లి కిషన్ యాదవ్, బి పేట నర్సింలు, దుంపల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love