నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం నాటికి విజయం సాధించి ఏడాది అయినందున బుధవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ప్రజా విజయోత్సవం – పనులు జాతర నినాదంతో రోజంతా పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన గత సంవత్సర కాలంలో అశ్వారావుపేట మండలం లో సుమారుగా రూ. 6 కోట్ల 80 లక్షల తో నిర్మించిన సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు,మహాత్మా గాందీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకం తో నిర్మించిన పనులకు ప్రారంభోత్సవం,సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు ఐన 85 మందికి రూ.63,84,764 లు విలువగల చెక్కులు పంపిణీ చేయనున్నారు.
పర్యటన వివరాలు :
ఉదయం 8 గంటలకు నారంవారిగూడెం,
9 గంటలకు అశ్వారావుపేట,
10.30 గంటలకు ఊట్లపల్లి,
11 గంటలకు వినాయకపురం,12 గంటలకు మల్లాయిగూడెం,మధ్యాహ్నం
1 గంటకు కావడిగుండ్ల,సాయంత్రం 3 గంటలకు గాండ్లగూడెం,
3.30 గంటలకు పెంచికలపాడు,4 గంటలకు బచ్చువారిగూడెం,4.30 గంటలకు గుమ్మడివల్లి,5 గంటలకు వడ్డి రంగాపురం,
5.30 గంటలకు నారాయణపురం,6 గంటలకు ఆసుపాక,7 గంటలకు కొత్త మామిళ్ళవారిగూడెం,
7.30 గంటలకు తిరుమలకుంట లో పర్యటించనున్నారు.