ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

– కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాండు యాదవ్‌
నవతెలంగాణ-పుల్కల్‌
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందని పుల్కల్‌ మండలానికి చెందిన పార్టీ సీరియల్‌ నాయకులు పాండు యాదవ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు అంతేకాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నిరుపేదల భూములను అన్యాక్రాంతంగా కబ్జాలు చేసిన చంటి క్రాంతి కిరణ్‌ కు ఈనెల 30న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు అంతేకాకుండా ఆందోల్‌ నియోజకవర్గం గత 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన దామోదర్‌ రాజనర్సింహ చేసిన అభివద్ధి పనులే నేటికీ పుల్కల్‌ ఉమ్మడి మండలంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు కానీ ఇటీవల 10 సంవత్సరాల కాలం పాటు పాలించిన పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారే తప్ప ఏ ఒక్క గ్రామంలో అభివద్ధి పనులు చేయకపోవడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని వారన్నారు ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను త్వరితగతిన అమలు చేసి తీరుస్తామని వారన్నారు అంతేకాకుండా అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకున్న నాయకుల ఆస్తులను విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు ఏది ఏమైనా కెసిఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు చెంప దెబ్బ లాంటి తీర్పు ఇవ్వడం తమకు ఎంతో గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love