కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు

– మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే 
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్ : కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అందుకే మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందనే దీమా వ్యక్తం చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మంగళవారం నాడు పీర్జాదీగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన వివిధ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం, ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమ కోసం పాటుపడుతున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందింద‌ని అన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి వస్తామనే దీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదీగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమీషనర్ నమ్య నాయక్,కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Spread the love