కాంగ్రెస్ హాయంలోనే ప్రజా సంక్షేమం: కొండ వార్ రాజు

నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ప్రజా సంక్షేమం అభివృద్ధి పనులు జోరుగా సాగుతాయని మద్నూర్ మండల పెద్ద తడగూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ వార్ రాజు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ హాయంలో ప్రజలకు గానీ గ్రామాల అభివృద్ధికి గానీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు ఐదు లక్షల నిధులు మంజూరు చేయించారని, ఆ నిధులతో మంగళవారం నాడు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల చేత ప్రారంభించడం జరిగిందని తెలిపారు, సీసీ రోడ్డు నిర్మాణం పనుల కోసం హాజరైన ముఖ్య నాయకులకు కొండా వార్ రాజు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి శాలువులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు ఈరన్న నాగనాథ్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగమేశ్వర్, మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు సాహెబ్ రావు, మేనూర్ గ్రామ మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, హనుమాన్లు స్వామి ధరాస్ సాయిలు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు వట్నాల రమేష్, ఇలేగావ్ యూనిస్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love