బహిరంగంగా కల్తీ కోవా విక్రయాలు 

– ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం 
– స్థానికులు పట్టుకొని మున్సిపల్ లో అప్పగింత 
నవతెలంగాణ – కంటేశ్వర్ 
అక్రమ ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ పదార్థాల విక్రయాలకు తెరలేపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగంగా కల్తీ కోవా విక్రయాలు జోరుగా జరుపుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న కల్తీ పదార్థ విక్రయాలు నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందే విక్రయిస్తున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. గత కొంతకాలంగా నిజామాబాద్ నగరంలో రోడ్లపై తిరుగుతూ నకిలీ కోవాను బన్ కు అంటించి ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన స్థానిక ప్రజలు ఆ బండి వ్యక్తిని నిలదీశారు. నిలదీయడంతో అసలు కథ మొదలయ్యింది. నగరంలో అసలు ఏం జరుగుతుంది ఏంటో సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు గట్టిగా స్థానికులు నిలదీయడంతో ఘటన వెలుగు చూసింది. వీరి నకిలీ కోవా దందా ఓ వ్యక్తి తన పిల్లలకు కోవా, బన్ వినిపించడంతో వాంతులు విరేచనాలు అయ్యాయి.
దీంతో ఈ వ్యాన్ ను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అప్పగించారు. మున్సిపల్ సిబ్బంది, ఆహార కల్తీ నియంత్రణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ సిబ్బంది శాంపిల్స్ సేకరించారు. కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్లు వ్యాన్ నిర్వాహకులు చెప్పారు. ఇందులో కోవా లేదని శక్కరి, రవ్వ, డాల్డా కదుపుతున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలో యధేచ్ఛగా నకిలీ తినే పదార్థాలు అమ్ముతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కార్పొరేషన్ పరిధిలో 20 రూపాయల తై-బజార్ కట్టి ఏమైనా అమ్ముకునే అవకాశం ఉన్నట్లు ఉంది పరిస్థితి. అడిగే వారు ఉండరు, పట్టించుకునే వారు ఉండరు. ప్రజలు కోవా అని నమ్మి తిన్నారంటే ఆసుపత్రి పాలవడం ఖాయం. వినియోగదారులు జాగృతం కావడం అవసరం. ఆహార కల్తీ నియంత్రణ శాఖ నెల నెల జీతాలు తీసుకునేందుకే తప్ప కార్యాలయం గడప దాటిన దాఖలు లేవు. ఈ మధ్యకాలంలో రోజురోజుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రముఖ హోటల్లు చిన్నాచిత హోటల్లు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్న ఆహార కల్తీ నియంత్రణ శాఖ మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
Spread the love