కెసిఆర్ కోలుకోవాలని పీపల్ పహాడ్ లో పూజలు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా కోలుకోవాలని చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు శనివారం జరిపించారు.ఈ సందర్భంగా పీపల్ పహాడ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొండ యాదగిరి ఆధ్వర్యంలో కెసిఆర్ ఆరోగ్యంగా త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని శ్రీశ్రీశ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మెట్టు మహేశ్వర్ రెడ్డి,గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఎర్ర అంజయ్య,రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వినుకొండ సత్యనారాయణ వార్డు సభ్యులు ఎర్ర గోపాల్,వలిగొండ కళ్యాణిరవి, నల్లంకి మాధవిమల్లేష్ గౌడ్ ఆలయ డైరెక్టర్లు చిదుగుళ్ల లింగస్వామి గౌడ్,చిర్కే అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Spread the love