వర్షాలు కురువాలని శివాలయంలో పూజలు

నవతెలంగాణ-వీణవంక
వానలు కురవాలని మండలంలోని నర్సింగాపూర్ గ్రామస్తులు సోమవారం శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచు గంగాడి సౌజన్య తిరుపతి రెడ్డితో పాటు లింగానికి జలార్చన చేసి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. వానలు కురవకపోవడంతో రైతాంగానికి తీవ్ర ఇబ్బందులవుతున్నాయని వాపోయారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురవాలని శివలింగానికి అర్చన చేసి కోరినట్లు తెలిపారు.

Spread the love