నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని కవిరాజ్‌నగర్ హరివిల్లు అపార్టుమెంటులో మట్టి గణపతికి మొదటి రోజు పూజలు చేశారు. బొంతు మాదవ్ రావు, సుధా, జక్కపూడి సుధాకర్, వరలక్ష్మి, పెంట్యాల అనిల్, మాధవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహ దాత రాయల రాంబాబు, లక్ష్మణ్ వారి కుమారుడు రాయల నరేష్, అపార్టుమెంటు వాసులు పాల్గొన్నారు.
ముదిగొండ : మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక సమితి పండగ వేడుకలను ప్రజలు, గణేష్ భక్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి, గణేష్ భక్తులు ప్రజలు పాల్గొన్నారు.