గిరిజన ఉనోత్సవంలో సంత్ సేవాలాల్ కు పూజలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో బాగంగా శనివారం గిరిజన ఉత్సవం గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి జోగా నాయక్ అధ్యక్షతన బంజారా నాయకుల ఆరాధ్య దైవం సేవాలాల్ చిత్ర పటానికి దండలు వేసి చిత్ర పటానికి కొబ్బరికాయలు కొట్టారు, పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గిరిజన ఉత్సవం సందర్భంగా ప్రాచీన గిరిజన సంస్కృతి  సాంప్రదాయాలను ఈ తరం వారికి తెలియజేస్తే అవకాశం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా తహసిల్దారు అల్లం రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత గిరిజనులకు, తండాలను, గ్రామ పంచాయితీలుగా, మార్చారు.10 శాతం రిజర్వేషన్ కల్పించారు ,అనంతరం గిరిజన పెద్దలు ,సర్పంచ్ లక్ష్మి జోగా, బూక్యా దేవా, ఉపాధ్యాయుడు, రఘురాంలను సన్మానించారు, అనంతరం, పంచాయితీ కార్యదర్శి శంకర్ ,తెలంగాణ ప్రభుత్వం గిరిజన కు చేసిన సేవల గురించి నివేదిక చదివి వినిపించారు, ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో, ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ కరుణాకర్, ఎం పి ఓ సాజిదా బేగం, పంచాయితీ ప్రత్యేక అధికారి హర్షద్ ,కార్యదర్శి శంకర్, గిరిజన నాయకులు, బుక్యా దేవా గారు, రఘురాం, మరియు గిరిజన మహిళలు పాల్గొన్నారు.

Spread the love