చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వీల్ ఛైర్ లో వచ్చిన పులివర్తి నాని

నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడిలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాల నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. అయితే, తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పులివర్తి నాని కాలికి పట్టీతో వీల్ చెయిర్ లో వచ్చారు. ప్రస్తుతం పులివర్తి నాని వీల్ ఛైర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Spread the love