నవతెలంగాణ – హైదరాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వినాయక్ దామోదర్ సావర్కర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు.