కెనడాలో పంజాబ్ యువకుడి హత్య

నవతెలంగాణ హైదరాబాద్: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో భారత సంతతి వ్యక్తి యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతనిపై కాల్పులు

జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్టు అక్కడి జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. యువరాజ్ పంజాబ్లోని లుథియానా చెందినవాడు. ఉన్నత చదువుల నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లాడు.

ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తూ… ఇటీవలే కెనడాలో శాశ్వత నివాస హోదా పొందాడు. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సర్రేకు చెందిన మన్వీర్ బస్రం (23), సాహిబ్ బస్రా (20), హర్కిరట్ ఝుట్టీ, ఒట్టారియోకి చెందిన కీలన్ ఫ్రాంకోయిస్(20)లను అరెస్టుచేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love