
చిరుధాన్యాలతో స్వచ్ఛమైన ఆహారం లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అంతూల్ అన్నారు. మంగళవారం వెంకట్రావుపేట సెక్టార్ పరిధిలోని మూడో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.. గర్భవతు లకు, బాలింతలకు, చిన్న పిల్లలకు చిరుధాన్యాలు మంచి ఆహారంగా ఉప యోగపడతాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చిరుధాన్యాలు హార పదార్థా లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార్ పదార్థా లతో అనేక రకాలైన లాభాలు ఉంటాయని తెలి పారు. అయోడిన్ ఉప్పు వాడుకోవాలని, చెక్కరి తక్కువ వాడుకొని బెల్లం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, అంగన్వాడి టీచర్లు పి. వీణా, జే. స్వప్న, ఎస్. జ్యోతి, ఆయాలు వి. భాగ్యలక్ష్మి, వి. వాణిశ్రీ, కవిత, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, యాదమ్మ, వినోద, పిల్లల తల్లిదండ్రులు, గర్భవతు లు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.