పక్కా మాస్‌ సినిమా

Pure mass movieవైష్ణవ్‌ తేజ్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. ‘మ్యాడ్‌’లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను సోమవారం ఏఎంబి మాల్‌లో జరిగిన వేడుకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌ మాదిరిగానే సినిమా కూడా మీ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు. ‘ఇదొక పక్కా మాస్‌ సినిమా. ఇందులో యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ, సాంగ్స్‌ అన్నీ బాగుంటాయి. ‘వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి’ తర్వాత వస్తున్న పర్ఫెక్ట్‌ మాస్‌ ఫిల్మ్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Spread the love