
నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామ లోని స్వయంభు శ్రీ పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులచే కల్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు గిరిప్రదక్షిణ, ఉదయం ఏడు గంటలకు సుదర్శన లక్ష్మీనరసింహ హోమం, ఉదయం 11 గంటలకు లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దాతలు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, నరసింహ స్వామి ఉపాసకులు బత్తిని రాములు గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, గ్రామ మాజీ ఉపసర్పంచ్ పబ్బతి రాములు, వార్డు సభ్యులు కొండాపురం లక్ష్మి సుధాకర్, సురూపంగా శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్ గౌడ్, పూర్ణగిరి ఆలయ కమిటీ సభ్యులు జిట్టా చంద్రారెడ్డి, పబ్బతి జంగయ్య వంశరాజ్, కంబాలపల్లి మంగమ్మ అంజనేయులు, సురూపంగా సత్తెమ్మ, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, బబ్బురి రమేష్ గౌడ్, ఎల్లంల బాల మల్లేష్ యాదవ్, తెల్జురి మల్లేష్ యాదవ్, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.