చైనాకు పుతిన్.. పర్యటన రేపటి నుంచే..

నవతెలంగాణ – బీజింగ్‌: ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్‌ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. పర్యటనలో రష్యా అధ్యక్షుడు.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఆహ్వానంపైనే పుతిన్‌ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

Spread the love