నవతెలంగాణ – హైదరాబాద్: పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం అన్నారు కేటీఆర్. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్న సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ గారు ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా పీవీ గారిని చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదని తెలిపారు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.