ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పీవీ సింధు..

PV Sindhu got engaged..నవతెలంగాణ – హైదరాబాద్: భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, తెలుగ‌మ్మాయి పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ ఈడీ వెంక‌ట ద‌త్త‌సాయితో తాజాగా రింగ్స్ మార్చుకున్నారు. దీని తాలూకు ఫొటోను సింధు త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ‘ఒక‌రి ప్రేమ మ‌న‌కు ద‌క్కిన‌ప్పుడు తిరిగి మ‌న‌మూ ప్రేమించాలి’ అనే బ్యూటీఫుల్ క్యాప్ష‌న్‌తో ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఆమె షేర్ చేశారు. ఫొటోలో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి సింధు కేక్ క‌ట్ చేయ‌డం కూడా ఉంది. కాగా, ఈ జంట ఈ నెల 22న రాజ‌స్థాన్‌లో పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరువురి కుటుంబాలు పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి.

Spread the love