ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

Quality checks in fertilizer shops– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
మండల కేంద్రంలోని పిఏసిఎస్, కాటాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి, ఓ డి సి ఎం ఎస్ ఫర్టిలైజర్ షాపులలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తో కలిసి ఆకస్మికంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం కాల్వపల్లి గ్రామంలోని దుర్గారం లో క్రాప్ బుకింగ్ వెరిఫికేషన్ నిర్వహించారు. షాపుల్లో ఫైవ్ యాప్ యూరియా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఈపాస్ ఆధారంగా యూరియాను ఫర్టిలైజర్ను విక్రయించాలన్నారు. యూరియాను రైతులకు అధిక ధరలకు అమ్మ రాదని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో అనుమతి లేకుండా ఫర్టిలై షాపులు నిర్వహించరాదు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్ శ్రీధర్, ఏఈఓ లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love