నవతెలంగాణ – రామారెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చే నాణ్యమైన విద్య అందుతుందని బుధవారం ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రంలో 2024- 25 విద్యా సంవత్సరం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ లను ఆయా పాఠశాలలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ యోసెఫ్, ఎంపీడీవో సవితా రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ప్రధాన ఉపాధ్యాయులు మురళి, దేవుల, సి ఆర్ పి లు మహమ్మద్, యుగేందర్, సురేఖ, మౌనిక, పడిగెల శ్రీనివాస్, జంగం లింగం, శ్యామ్, లింబాద్రి నాయక్, పులి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.