బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి

నవతెలంగాణ కంఠేశ్వర్ : బస్తి దావకానాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని నిజామాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారిని రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ పట్టణంలోని ఖానాపూర్, నాగారం బస్తీదావఖానా లను ఆకస్మికంగా తనిఖీ చేసి వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని , ఇతర వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ.. ప్రతి ఆశ కార్యకర్త డ్యూ లిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తి దావఖానాలకు వచ్చేలా చూడాలన్నారు. వ్యాక్సిన్ క్యారియర్ ఐస్ ప్యాక్సులో కూలిoగ్ ఉండేలా చూడాలన్నారు. బస్తీ దావకానాల్లో మరియు ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ ,ప్రతిరోజు ఓపిని చూడాలని, లీవ్స్ రిజిస్టర్ మైంటైన్ చేస్తూ, లీవ్స్ ను డిప్యూటీ డిఎంహెచ్వోల అనుమతి తీసుకోవాలని, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు వారి స్థానంలో ఇతరులను వారికి బదులు నియమించాలని కోరారు. ఖానాపూర్ బస్తి దావకాన స్థానిక మొదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి, నాగారం బస్తీ దావకాన వారు స్థానిక పట్టణా ఆరోగ్య కేంద్రం సీతారాం నగర్ కాలనీ నుండి సరిపడా మందులను తీసుకొవలన్నారు.రికార్డులు మెయింటైన్ చేయాలనీ, క్షేత్రస్థాయిలో గృహ సందర్శన చేసి వ్యాధిగ్రస్తులను బస్తీ దావకానకు తరలించేలా ఆశాలు, ఏఎన్ఎం లు చూడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు , ఏఎన్ఎం లు, ఆశాలు పాల్గొన్నారు.
Spread the love