నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..

– శ్రీ శ్రీనివాస పిల్లల ఆసుపత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
 నవతెలంగాణ  – భువనగిరి
జిల్లా కేంద్రంలోని ఆజాద్ రోడ్ లో సోమవారం శ్రీ శ్రీనివాస పిల్లల ఆసుపత్రిని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా  సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ధనాపేక్ష కాకుండా మాననీయ కోణంలో వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అన్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల వారికి బస్టాండ్ సమీపంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని స్థాపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం సభ్యులు తాడూరి సులోచన చంద్రయ్య తాడురి నరోత్తం( శేఖర్) వార్డు కౌన్సిలర్ వడి చర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ లతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Spread the love