కాంగ్రెస్ భవన్ వద్ద క్విట్ ఇండియా దినోత్సవం 

నవతెలంగాణ- కంటేశ్వర్

కాంగ్రెస్ భవన్ వద్ద క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ జెండా బుధవారం ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా జెండా ఎగరవేసిన అనంతరం ఇటీవల గద్దర్ గారి అంతిమయాత్రలో గుండెపోటుతో మరణించిన సియాసాట్ పత్రిక సబ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ కి జిల్లా కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తహేర్ బిన్ హమ్దన్ ,రూరల్ ఇంచార్జ్ భూపతి రెడ్డి ,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనచివేతకు గురైన ప్రజలకు స్వాతంత్రం కల్పించడానికి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలడానికి మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆయన అన్నారు.మహాత్మ గాంధీ  ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా భారత ప్రజలకు స్వాతంత్రం లభించింది అని, కానీ ప్రస్తుతం బ్రిటిష్ వారి వారసులుగా దేశంలో బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చులు పెడుతూ దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందని ,స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేస్తే ప్రస్తుతం బిజెపి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని ,బిజెపి దేశభక్తి పనులు ఒక్కటి కూడా చేయకుండా దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తుందని ఆయన అన్నారు. ఆనాడు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలడానికి క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా జరిగిందో ప్రస్తుతం క్విట్ బిజెపి, క్విట్ బి ఆర్ ఎస్ ఉద్యమాలు జరగాలని ,బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన అన్నారు. బిజెపి,బిఆర్ఎస్ ప్రభుత్వాల అహంకారపు చర్యలను ఎదిరిస్తూ వాటిని గద్దె దించడం కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందని ,కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా దేశంలో బిజెపిని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించేంతవరకు కృషి చేయాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.అదేవిధంగా ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కేశ వేను మాట్లాడుతూ స్వర్గీయ సోనియా గాంధీ  ఆదేశాల మేరకు ఈ రోజున జాతీయ యువజన కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ అనుబంధ సంస్థగా ప్రకటించారని ,తద్వారా దేశంలో యువకుల యొక్క సేవలను ఉద్దేశాభ్యున్నతికి ఉపయోగపడుతుందని, యువత దేశభక్తితో దేశసేవకు నిమగ్నం అయ్యే ఆలోచనతో సోనియాగాంధీ, యువజన కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, ఈరోజు నిజామాబాద్ నగరానికి కేటీఆర్ వస్తున్న సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధాలు చేశారు కావున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగిందని ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని యువజన కాంగ్రెస్ నాయకులందరికీ యువజన కాంగ్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్ సేవదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మలైకా, నగర ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్, కైసర్, ప్రసాద్, కేశ రాజు, ఏజాజ్, సాగర్, ముశ్శు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love