విద్యార్థులకు క్విజ్ పోటీలు.. బహుమతులు

నవతెలంగాణ మాక్లూర్
మాక్లూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మంగళవారం రోజు క్వీజ్ కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని పాఠశాల పదవ తరగతి విద్యార్థిని జి. ఆకాంక్ష, అర్షిత లు మొదటి బహుమతిగా, ఎస్. అర్జున్, రూపేష్ నందు మదన్ పల్లి పాఠశాల విద్యార్థులు రెండవ బహుమతిగా, జే. భవ్య, రుచిత చిన్నపూర్ పాఠశాల విద్యార్థినిలు మూడవ బహుమతి లుగా గెలుపొందారు. మొదటి బహుమతిగా నగదు రూ. 5 వేలు, రెండవ బహుమతిగా రూ. 4 వేలు, మూడవ బహుమతిగా రూ. 3 వేలు అందజేశారు. మొదటి గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో నిజామాబాద్ లో జూలై 4న ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, అర్బిఐ ప్రతినిధి, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love