మాల్దీవుల పార్లమెంటులో రగడ..

నవతెలంగాణ – హైదరాబాద్: మాల్దీవుల పార్లమెంటులో నేడు ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఓ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం పొందే క్రమంలో ఇవాళ నిర్వహించిన ఓటింగ్ రసాభాసకు దారితీసింది. ఎండీపీ ఎంపీ ఇసా, పీఎన్సీ ఎంపీ అబ్దుల్లా షహీమ్ పరస్పరం దాడికి దిగారు. మెడ విరిచి, జుట్టు పీకి, కాలు మెలితిప్పి… ఆ ఎంపీల ఫైటింగ్ ఇలా సాగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు కలబడడంతో ఇతర ఎంపీలు వారిద్దరినీ విడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సదరు, తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం ఎక్కి, స్పీకర్ చెవిలో బూరతో పెద్దగా ఊదడం మొదలుపెట్టారు. ఆ మోత తట్టుకోలేక స్పీకర్ చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఈ రగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Spread the love