ప్రజల మన్ననలను పొందిన మహనీయుడు రఘుబాబు

– పైడాకుల కృష్ణమూర్తి మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రజల మన్ననలను పొందిన మహనీయుడు ఎడ్లపల్లి రఘుబాబు అని మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పైడాకుల కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని లక్నవరం గ్రామపంచాయతీ ఆవరణలో దుంపలగూడెం గ్రామంలో మాజీ మండల అధ్యక్షులు కీర్తిశేషులు ఎడ్లపల్లి రఘుబాబు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తండ్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడాకుల కృష్ణమూర్తి హాజరై విగ్రహ ఆవష్కరణ చేసి రఘు బాబుకు నివాళులు అర్పించి  ప్రజలతో మాట్లాడారు. ఎడ్లపల్లి రఘుబాబు  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేశారని, మళ్ళీ అలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి దొరకడని, మంచితనంతో మండల ప్రజల హృదయాలను గెలుచుకున్న మహోన్నత నాయకుడు రఘుబాబు అని అన్నారు. మండల ప్రజల సమస్యల్లో తను బాగం అయి, ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందాడు. మంచికి మారు పేరుగా ప్రజలతో ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రఘుబాబు లాంటి నాయకులు మాత్రం దొరకరు అని అన్నారు. అతని సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్వాయి ఎంపీటీసీ గుండె బోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, జిల్లా నాయకులు వేల్పుగొండ పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మద్దాల నాగమణి, జిల్లా నాయకురాలు సూది రెడ్డి జయమ్మ, పులుసం లక్ష్మి, తోకల అహల్య, అలాగే దుంపెళ్ళిగూడెం గ్రామస్థులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love