బీజేపీ ఎల్పీ నేతగా రఘునందన్‌రావు?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ ఎల్పీ నేతగా రఘునందన్‌రావును ఆ పార్టీ నియమించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కిషన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకూ బీజేపీఎల్పీ నేతగా ఉన్న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోనే రఘునందన్‌రావును నియమించబోతున్నారనీ, అధికారికంగా బుధవారం శాసనసభ కార్యదర్శికి లేఖను అందించనున్నారని తెలిసింది.

Spread the love