మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

నవతెలంగాణ ఢిల్లీ: లోక్‌సభలో దుండగుల చొరబాటు ఘటనపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని మీడియాతో వ్యాఖ్యానించారు. (Parliament Security Breach) ‘పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం నిజంగానే జరిగింది. కానీ అది ఎందుకు జరిగిందనేది ముఖ్యం. అందుకు కారణం నిరుద్యోగం. మోడీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య నిరుద్యోగం’ అని రాహుల్‌ కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారని వెల్లడించారు.

Spread the love