రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీలోకి రాహుల్‌ గాంధీ

Bharatamata is the voice of every Indianనవతెలంగాణ-హైదరాబాద్ : ‘మోడీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేశారన్న కేసులో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా రక్షణశాఖపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఎంపికయ్యారు. మార్చి నెలలో సభ్యత్వం కోల్పోకముందు కూడా రాహుల్‌ ఈ కమిటీలోనే సభ్యుడిగా ఉన్నారు. ఇందులోకి కాంగ్రెస్‌ ఎంపీ అమర్‌ సింగ్‌ కూడా నామినేట్‌ అయినట్లు లోక్‌సభ బులిటెన్‌ వెల్లడించింది. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్‌ఆద్మీ తరఫు ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్టాండింగ్‌ కమిటీకి ఎంపికయ్యారు. ఇటీవల జలంధర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో రింకూ ఎన్నికయ్యారు. ఇక మార్చి నెలలో లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్‌ మొహమ్మద్‌.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీకి నామినేట్‌ అయ్యారు.

Spread the love