నవతెలంగాణ-కోహెడ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజెపీ కుట్రపూరితంగా వ్యవహారించి రాహుల్‌గాంధీపై కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేసి సభ్యత్వాన్ని రద్దు చేయించిందన్నారు. మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ప్రజాస్వామ్య విజయమన్నారు. రానున్న ఎన్నికలలో ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాగాయకుడు గద్దర్ మృతి చెందడం పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శెట్టి సుధాకర్, పార్టీ మండల ప్రధాకార్యదర్శి వేల్పుల వెంకటస్వామి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్, సోషల్ మీడియా అధ్యక్షులు అబ్దుల్ రఫీ, ప్రతాప్‌రెడ్డి, నరసింహరెడ్డి, జాగిరి కుమార్, చేపురి శ్రీశైలం, నంగునూరి శ్రీనివాస్, చెప్యాలా రవీందర్, బైరి సుధాకర్, శనిగరం తిరుపతి, తిమ్మాపురం సంపత్, ఎల్లబొయిన శ్రీకాంత్, సుదర్శన్, లింగయ్య, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.