నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సా.4.45 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కులగణన విధివిధానాలు, సామాజిక న్యాయం కోసం ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపై మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం రా.7.10 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్తారు.