వరంగల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర

నవతెలంగాణ వరంగల్‌: తెలంగాణ ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్‌లోని రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు విచ్చేసిన ఆయన పాదయాత్రగా సభా ప్రాంగణానికి కదిలారు. వీధుల గుండా ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. దాంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love