జనంలో రాహుల్‌

Rahul in the crowd– మణిపూర్‌ పునరావాసులకు
– అండగా ఉంటానని భరోసా
సిల్చార్‌ : మణిపూర్‌లో ఏడాదికి పైగా కొనసాగుతున్న హింసాకాండ కారణంగా నిరాశ్రయులుగా మారి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితుల్ని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం పరామర్శించారు. మణిపూర్‌లోని జిరిబామ్‌, చురచాంద్‌పూర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించిన రాహుల్‌గాంధీ అక్కడ ఉన్న బాధితులతో మమేకమయ్యారు. కొన్ని నెలల నుంచి ఈ కేంద్రాల్లోనే వీరు ఉంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులతో ఇక్కడకు వచ్చిన రాహుల్‌ గాంధీ నిరాశ్రయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సోమవారం ముందుగా అస్సాంలోని సిల్చార్‌కు వాయుమార్గం ద్వారా రాహుల్‌గాంధీ చేరుకున్నారు. సిల్చార్‌లోని కుంభిర్‌గ్రామ్‌ ఎయిర్‌పోర్టులో అసోం పీసీసీ అధ్యక్షులు భూపేన్‌ బోర్హా, ఇతర సీనియర్‌ నాయకులు, జిల్లా నాయకులు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ తరువాత అసోంలో వరదబాధితుల్ని రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా భూపేన్‌ బోర్హా రాహల్‌ గాంధీకి ఒక మెమోరాండం సమర్పించారు. భారీ వరదలకు తీవ్రంగా నష్టపోయిన అస్సాంకు తగిన ఉపశమనం, నష్టపరిహారం లభించేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించాలని ఈ మెమోరాండంలో భూపేన్‌ బోర్హా కోరారు. విధ్వంసకర వరదల పరిస్థితిని పరిష్కరించడానికి అస్సాంకు ఒక ప్రత్యేక ప్యాకేజీని అందించాలని కూడా బోర్హా కోరారు. అలాగే కేంద్రం నుంచి తగిన నిధులను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం యొక్క రెండింత వైఫల్యంగా బోర్హా విమర్శించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మణిపూర్‌లో జిరిబామ్‌కు రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. అక్కడ మణిపూర్‌ పిసిసి అధ్యక్షులు కెయిశం మేఘ చంద్ర, సీఎల్‌పీ నేత ఓ ఇబోబి సింగ్‌ ఇతర నాయకులతో కలిసి పునరావాస కేంద్రాలను రాహుల్‌ సందర్శించారు. ‘ప్రజలకు మద్దతు అందించడం, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం లక్ష్యంగా రాహుల్‌ గాంధీ పర్యటన సాగింది. హింసాకాండలో బాధితుల ఆందోళనలను పరిష్కరించడానికి కాంగ్రెస్‌ నిబద్ధతను రాహుల్‌ గాంధీ పర్యటన ప్రతిబింబిస్తుంది’ అని విలేకరులతో మాట్లాడుతూ మేఘచంద్ర తెలిపారు. న

Spread the love