బైక్‌పై రాహుల్‌ రరు..రరు

Rahul does not come on a bike– లద్దాక్‌లో తన తండ్రిని గుర్తు చేసుకున్న తనయుడు
న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీకి బైక్‌ రైడ్‌ అంటే ఎంత ఇష్టమో.. తరచుగా వింటూనే ఉంటాం. ఇటీవల ఢిల్లీలోని బైక్‌ మెకానిక్‌ దుకాణంలో కనిపించారు. కొన్నిసార్లు అతను రోడ్లపై బైక్‌ నడుపుతుంటారు. అయితే ఈసారి లడఖ్‌లోని పాంగోంగ్‌ సరస్సు వైపు బైక్‌ రైడ్‌ చేశారు.
ఆగస్ట్‌ 20 రాహుల్‌ తండ్రి , దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి కావటంతో.. రాహుల్‌ గాంధీ పాంగోంగ్‌ సరస్సుకు వెళ్లి తన తండ్రికి నివాళులర్పించడానికి వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో తన బైక్‌ రైడ్‌ చిత్రాలను పంచుకుంటూ, రాహుల్‌ గాంధీ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ, తన క్యాప్షన్‌లో ఇలా రాశారు. ”పాంగాంగ్‌ సరస్సుకు వెళ్లే మార్గం… ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా మా నాన్న చెప్పేవారు.” అని పేర్కొన్నారు.
హెల్మెట్‌, గ్లౌజులు, రైడింగ్‌ బూట్లు , జాకెట్‌ ధరించి, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ మొదట ఫుల్‌ బైకర్‌ స్టైల్‌లో కనిపించారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కూడా భారత్‌ జోడో యాత్రలో మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో బైక్‌పై ప్రయాణించిన విషయం విదితమే.

Spread the love