శరద్‌ను కలిసిన రాహుల్‌

న్యూఢిల్లీ :ఢిల్లీలోని శరద్‌పవార్‌ నివాసంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాందీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్సీపీలో అంతర్గత వివాదాలు నెల కొన్న సమయంలో రాహుల్‌ భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌ మీ వెంటే ఉందని చెప్పారని ఎన్సీపీ అధినేత్రి సోనియా దుహాన్‌ అన్నారు. సోనియా గాంధీ కూడా శరద్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.ఎన్సీపీ కార్యవర్గ సమావేశం అనంతరం శరద్‌ పవార్‌ మాట్లాడుతూ రాహుల్‌ వచ్చి కలవటంతో.. మాలో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం అనంతరం ఎన్సీపీ నేత పిసి చాకో మాట్లాడుతూ తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో నాయకులు శరద్‌ పవార్‌పై విశ్వాసం ఉంచారని అన్నారు.
27 రాష్ట్ర యూనిట్లు శరద్‌ పవార్‌ వర్గంతో ఉన్నాయి. సమావేశంలో 8 తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వంలో చేరిన 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు అజిత్‌ పవార్‌ ఈ సమావేశాన్ని చట్ట విరుద్ధమన్నారు. ఎన్సీపీపై ఎవరికి అధికారం ఉందో నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌ పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పిలిచే హక్కు పార్టీకి చెందిన ఏ నాయకుడికి లేదు.40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతుతో ఎన్సీపీ పేరు, గుర్తును అజిత్‌ పవార్‌ గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యేలందరి సంతకాలతో కూడిన అఫిడవిట్లను ఆయన ఎన్నికల సంఘానికి అందజేశారు.
పార్టీ ఎన్నికల గుర్తుపై అజిత్‌ పవార్‌ చేస్తున్న వాదనపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని శరద్‌ పవార్‌ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా నరేంద్ర రాణేను అజిత్‌ వర్గం గురువారం నియమించింది.

Spread the love