18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక

నవతెలంగాణ -కరీంనగర్‌: కొండగట్టు నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం  అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు. పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు.

Spread the love