పట్టణంలోని మామిడిపల్లి నలంద ప్రీ స్కూల్లో గురువారం రెయిన్ బో డే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఇంద్రధనస్సులో ఉన్న రంగురంగుల దుస్తులతో ఈ కార్యక్రమంలో అలరించారు. విద్యార్థులకు రంగుల పట్ల అవగాహన కలిగించడం కోసం, రంగుల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం, ఏ రంగు ఏ సంకేతాన్ని తెలియజేస్తుందో వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమనేదని ప్రతి ఒక్క విద్యార్థి వారి జీవితాన్ని రంగులమయం చేసుకునేలా వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్ సాగర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రీస్కూల్ ఉపాధ్యాయునిలు ఫాతిమా, అయేషా, అరుంధతి, శ్రావణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.